కేసీఆర్ గాలి 7వ తేదీన పెను తుపానుగా మారబోతోంది: కడియం శ్రీహరి
- టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోంది
- కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు కూడా గెలిచే పరిస్థితి లేదు
- కేసీఆర్ ను ఎదుర్కొనే నేత మహాకూటమిలో లేరు
మహాకూటమి తెలంగాణ వ్యతిరేకుల కూటమి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని... ఆ పార్టీలో ఉన్న సీఎం అభ్యర్థులు కూడా ఓటమిపాలవుతారని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే నేత మహాకూటమిలో లేరని కడియం అన్నారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు. కోదండరామ్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేదని అన్నారు.