కంటి చూపు, కాలి గోటితో కాదు.. సంభ్రమాశ్చర్యాలతోనే బాలయ్య ఎవరినైనా చిత్తు చేస్తాడు!: విజయసాయిరెడ్డి సెటైర్
- బాలకృష్ణ హెచ్చరికలను లైట్ గా తీసుకోవద్దు
- తడాఖా చూపిస్తా అంటూ తొడగొడుతున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
అంతకుముందు స్పందిస్తూ.. ‘ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు’ అని ఏపీ సీఎం చంద్రబాబు హేళనగా మాట్లాడారని విజయసాయిరెడ్డి విమర్శించారు. దేశంలోని ప్రజలంతా ఒకే జాతి అనీ, సాంఘిక విభజన వల్లే కులాలు పుట్టాయన్నారు. ఈ విషయాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ చెప్పారన్నారు. ఈ విభజనను రూపుమాపాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.