ముస్లింల కోటా పేరుతో ఓటర్లను హైజాక్ చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం: కేంద్రమంత్రి నక్వీ ధ్వజం
- ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ రాజ్యంగ విరుద్ధం
- ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు
- ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే
‘‘మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని కేసీఆర్‌కే కాదు, కాంగ్రెస్‌కు కూడా తెలుసు. రాజ్యాంగం ఇందుకు అనుమతించదని కూడా వారికి తెలుసు’’ అని నక్వీ పేర్కొన్నారు. ఇటువంటి హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల కల్పనలో ముస్లింల రిజర్వేషన్‌ను 12 శాతానికి పెంచుతూ ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. దీనిని గుర్తు చేస్తూ నక్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.