అదరగొట్టేస్తోన్న చరణ్ 'తందానే తందానే' సాంగ్
- హుషారుగా సాగే దేవిశ్రీ సంగీతం
- ఆకట్టుకుంటోన్న శ్రీమణి సాహిత్యం
- జనవరి 11వ తేదీన విడుదల
"తందానే తందానే తందానా తందానే .. చూశారా ఏ చోటైనా ఇంతానందాన్నే .., తందానే తందానే తందానా తందానే .. కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండుగనే .. " అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. సినిమాలో పండుగ వాతావరణంలో సాగే ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట చిత్రీకరణ జరిగినట్టుగా అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం బాగున్నాయి. బోయపాటి మార్క్ తో ఈ పాట తెరపై నిండుగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్నేహ .. ప్రశాంత్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.