నోట్ల రద్దు ఎఫెక్ట్ ఏమాత్రం లేదు.. ఎన్నికల్లో పట్టుబడుతున్నదంతా నల్లధనమే: తాజా మాజీ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రావత్
- ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది
- గత ఎన్నికల కంటే ఈసారి మరింత ఎక్కువ డబ్బు పట్టుబడింది
- ఎన్నికల్లో ఉపయోగిస్తున్న సొమ్మంతా బ్లాక్ మనీనే
గత వారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రావత్ రిటైర్ అయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఒక పని చేయలేకపోయినందుకు చింతిస్తున్నానని ఆయన అన్నారు. ఎన్నికల్లో డబ్బు వినియోగం, సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర న్యాయశాఖకు రెకమెండేషన్లు ఇవ్వలేకపోయానని చెప్పారు.
రాజకీయ పార్టీలు తీసుకునే విరాళాలలో పారదర్శకతను తీసుకురావడానికి చాలా కాలం పడుతుందని రావత్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఖర్చులపై ఒక సీలింగ్ ఉండాలనే విషయంపై ఆగస్టులో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించామని... సీలింగ్ కు సంబంధించి అన్ని పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపైనే ప్రస్తుతం సీలింగ్ ఉందని... ఇదే సమయంలో రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చుపై సీలింగ్ లేదని అన్నారు.