మాది రైతు ప్రభుత్వం: సీఎం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాది రైతు ప్రభుత్వం: సీఎం

తమది రైతు ప్రభుత్వం అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పలు అంశాల గురించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల హయాంలో కనీసం ఒక్కసారైనా తమది రైతు ప్రభుత్వం అని చెప్పేందుకు సాహసించారా? అని సీఎం ప్రశ్నించారు. వ్యవసాయానికి అనుసంధానిస్తున్న అన్ని రంగాలకూ బడ్జెట్ నుంచి రూ.5,500 కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం కల్పించేందుకు రుణాలపై వడ్డీ భారం తగ్గించామని, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించామని తెలిపారు. రైతులకు రాయితీలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుందని సీఎం స్పష్టం చేశారు.

More Telugu News