రాజమౌళి మల్టీస్టారర్‌లో ప్రియమణి!

  • ప్రముఖంగా కీర్తి సురేష్, రష్మిక పేర్లు
  • ప్రియమణిని సంప్రదించిన రాజమౌళి
  • 12-12-12న కీలక ప్రకటన
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో తెరకెక్కుతోందని మాత్రమే మనకు తెలుసు. కథానాయికల పేర్లు కూడా ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. దీనికి సంబంధించి కీర్తి సురేష్, రష్మిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఓ కీలక పాత్రకు ప్రియమణిని రాజమౌళి సంప్రదించారని సమాచారం. ఇప్పటికే మేజిక్ డేట్ 12-12-12న కీలక ప్రకటన ఉంటుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే నటీనటుల గురించి ఆ రోజున రాజమౌళి వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Rajamouli
NTR
Ram Charan
Priyamani
keerthi suresh
Rashmika

More Telugu News