మహాకూటమిని మాయా కూటమి అన్నారు.. ఇప్పుడదే గూటంలా తయారయింది: సీపీఐ నారాయణ
- పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన వ్యక్తిలా కేసీఆర్ మాట్లాడుతున్నారు
- సమైక్యవాదులను కేబినెట్ లో కూర్చోబెట్టింది కేసీఆరే
- రూ.34 వేల కోట్ల ఇసుక మాఫియాకు నాయకుడు కేటీఆర్
పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన వ్యక్తిలా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. సమైక్యవాదులని తీసుకొచ్చి కేబినెట్ లో కూర్చోబెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నారని... ఇప్పుడు ప్రజలు మొత్తం ప్రతిపక్షంగా ఏర్పడ్డారని చెప్పారు. ఏడాదికి రూ. 34 వేల కోట్ల ఇసుక మాఫియాకు కేటీఆర్ నాయకుడని అన్నారు. వైరా నియోజకవర్గం చిన్న మునగాల గ్రామంలో ప్రజాకూటమి అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ నారాయణ పైవ్యాఖ్యలు చేశారు.