భారత సెక్స్ వర్కర్ కథ విని కంటతడి పెట్టిన బిల్ గేట్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత సెక్స్ వర్కర్ కథ విని కంటతడి పెట్టిన బిల్ గేట్స్

  • హైస్కూల్ లో చదువుతున్న సెక్స్ వర్కర్ కుమార్తె
  • మీ అమ్మ సెక్స్ వర్కర్ అంటే గేలి చేసిన తోటి విద్యార్థులు
  • తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న చిన్నారి
ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ప్రపంచ వ్యాప్తంగా తన ఫౌండేషన్ తరపును ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా భారత్ లో ఎయిడ్స్ పై కూడా ఆయన ఫౌండేషన్ పని చేస్తోంది. ఈ క్రమంలో ఆయన పలుమార్లు భారత్ కు విచ్చేశారు. 2000 దశకం ప్రారంభంలో భారత్ కు వచ్చిన ఓ సందర్భంలో ఒక సెక్స్ వర్కర్ కథ విని చలించిపోయిన ఆయన... కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.

కొందరు సెక్స్ వర్కర్లతో బిల్ గేట్స్ ఆయన భార్య మిలిందాలు సమావేశమయ్యరు. వారితో పాటే గేట్ దంపతులిద్దరూ నేలపై కూర్చొని వారి కథలను విన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన కథను వినిపించింది. హైస్కూల్ చదువుతున్న తన కుమార్తెకు తాను సెక్స్ వర్కర్ అనే విషయం తెలియదని ఆమె తెలిపింది. తాను సెక్స్ వర్కర్ అనే విషయాన్ని తెలుసుకున్న ఆమె తోటి విద్యార్థులు... తన కుమార్తెను గేలి చేస్తూ, ఆమెకు మనశ్శాంతి లేకుండా చేశారని చెప్పింది.

ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే తన కూతురు డిప్రెషన్ లోకి కూరుకుపోయిందని తెలిపింది. ఓ రోజు తాను ఇంటికి వచ్చేసరికి... తన కుమార్తె సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని, వేలాడుతూ కనిపించిందని కంటతడి పెట్టింది. ఇలాంటి పరిస్థితిని తాను ఎంత మాత్రం స్వీకరించలేనని సూసైడ్ నోట్ లో పేర్కొందని తెలిపింది. తన కూతురు ఆత్మహత్యను చూసి తన గుండె బద్దలైందని చెప్పింది. ఆమె చెప్పిన విషయాన్ని వింటూ బిల్ గేట్స్ చలించిపోయారు. అలాగే ఏడుస్తూ ఉండిపోయారు.

ఈ విషయాన్ని గేట్స్ ఫౌండేషన్ ఎయిడ్స్ నివారణ కార్యక్రమం హెడ్ అశోక్ అలెగ్జాండర్ తన పుస్తకం 'ఏ స్ట్రేంజర్ ట్రూత్: లెసన్స్ ఇన్ లవ్, లీడర్ షిప్ అండ్ కరేజ్ ఫ్రం ఇండియాస్ సెక్స్ వర్కర్స్'లో వెల్లడించారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను బిల్స్ గేట్స్ పక్కనే కూర్చున్నానని... తల వంచుకుని ఆయన రోదిస్తూనే ఉన్నారని పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. 
bill gates
gates foundation
S*x worker
cry

More Telugu News