సికింద్రాబాద్లో దారుణం.. తల్లిదండ్రులకు మద్యం తాగించి పసిబాలుడి కిడ్నాప్
- సికింద్రాబాద్లోని లాలాగూడ రైల్వే స్టేషన్లో ఘటన
- నమ్మకంగా ఉండి మోసం చేసిన స్నేహితుడు
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఉదయం నిద్ర లేచిన శ్రీకాంత్ బాబు కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. అయితే, బాబుతోపాటు గౌస్ కూడా కనిపించకపోవడంతో అనుమానించాడు. తన కుమారుడిని అతడే కిడ్నాప్ చేసి ఉంటాడని భావించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌస్ కోసం గాలిస్తున్నారు. తుకారాం గేట్ ప్రాంతంలో గౌస్ బాబును తీసుకుని ఆటో ఎక్కి వెళ్లినట్టు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.