సీఎం నివాసం వద్ద అన్న క్యాంటీన్.. ప్రారంభించి భోజనం చేసిన చంద్రబాబు

  • సీఎం నివాసం సమీపంలో అన్న క్యాంటీన్ ప్రారంభం
  • మంత్రులతో కలిసి భోజనం చేసిన సీఎం
  • నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్‌లకు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 368 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అయితే, కలెక్టర్ల సమావేశంలో మరో రెండు పెంచి మొత్తం 370 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

 శుక్రవారం రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మంత్రులు నారాయణ, నక్కా ఆనందబాబు, అధికారులతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం పట్టణాల్లో 160, గ్రామీణ ప్రాంతాల్లో 53 క్యాంటీన్లు ఉన్నాయి. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం ఒక అన్న క్యాంటీన్ ఉండేలా చూస్తామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Anna canteen
Amravathi
vundavalli

More Telugu News