ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఒక రోజు పట్టింది.. చంద్రబాబు-రాహుల్ కలయికపై రఘువీరారెడ్డి
- ఒంటరిగా పోటీ చేస్తే 40-50 సీట్లు కూడా రావు
- రాహుల్ నిర్ణయమే ఫైనల్
- ఒంటరిగా వెళ్లేందుకు కూడా రెడీ
శుక్రవారం అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రఘువీరా.. రాహుల్ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా రాహుల్‌కే వదిలేస్తున్నట్టు చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా ముందుకెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రఘువీరారెడ్డి తెలిపారు.