ఈఎస్ఐ కుంభకోణంలో తన పేరు లేకుండా కేసీఆర్ చేసుకున్నారు: ఉత్తమ్ ఆరోపణలు

  • కేసీఆర్ నాడు కేంద్ర మంత్రిగా అక్రమాలకు పాల్పడ్డారు
  • ఈఎస్ఐ కుంభకోణంలో ఏ-1గా ఆయన పేరుంది
  • ఢిల్లీ చుట్టూ తిరిగి తన పేరు లేకుండా చేసుకున్నారు
కేసీఆర్ నాడు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకున్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ప్రజాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తొలుత, ఉత్తమ్ మాట్లాడుతూ, నాడు ఈఎస్ఐలో జరుగుతున్న అక్రమాలను సీబీఐ బయటపెడుతున్న సందర్భంలోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు.

 యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఛార్జిషీట్ లో కేసీఆర్ పేరు కూడా ఉందని, ఈ కుంభకోణంలో ఏ-1గా ఆయన పేరు ఉందని అన్నారు. అయితే, కంటి శస్త్ర చికిత్స పేరిట కేసీఆర్ ఢిల్లీ చుట్టూ తిరిగి ఆ ఛార్జిషీట్ లో తన పేరు లేకుండా తీసేయించుకున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ మధ్య సంబంధాలు క్రమంగా బయటపడుతున్నాయని, రాష్ట్ర హామీలు నెరవేర్చని మోదీని కేసీఆర్ ప్రశ్నించకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. 
Go Back to Shorts
kcr
TRS
Congress
Uttam Kumar Reddy

More Telugu News