రేవంత్ భద్రతపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
- మరోసారి హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
- ఉత్తర్వులను సవరించాలని కోరిన కేంద్రం
- 4 ప్లస్ 4 భద్రత, ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశం
తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని రేవంత్ పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కేంద్రం కోరింది. కేంద్రం అప్పీల్‌ను అంగీకరించిన న్యాయస్థానం.. రేవంత్‌కు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ 4 ప్లస్ 4 భద్రత, ఎస్కార్ట్ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.