Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కవచం' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • వచ్చేనెల 2వ తేదీన ఆడియో రిలీజ్ 
  • 7వ తేదీన సినిమా విడుదల    
తొలి సినిమాతోనే మాస్ ఆడియన్స్ కి చేరువైన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాత కథల్లోను మాస్ కి నచ్చే అంశాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. తన తాజా చిత్రం విషయంలోను ఆయన అదే పద్ధతిని అనుసరించాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కవచం' రెడీ అవుతోంది.

శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 7వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుక రిలీజ్ కి ప్లాన్ చేశారు. వచ్చేనెల 2వ తేదీన భీమవరం - చిన్నమైరంలోని సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కాజల్ .. మెహ్రీన్ కథానాయికలుగా నటించారు.   
bellamkonda
kajl
mehreen

More Telugu News