చంద్రబాబు కోరగానే.. వైఎస్ మగాడిలా సీబీఐ విచారణకు ఆదేశించారు!: వైసీపీ నేత పార్థసారథి
- అన్నింటిని టీడీపీ మంత్రులు, నేతలు దోచేస్తున్నారు
- ఓఆర్ఆర్ పై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
- దోమలపై దండయాత్రలో కూడా బాబు విఫలం
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు ‘తమ్ముళ్లూ.. హైదరాబాద్ ఎయిర్ పోర్టును కట్టింది నేను కాదా.. ఓఆర్ఆర్ నిర్మించింది నేను కాదా!’ అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ నిర్మిస్తుంటే.. రైతుల భూములను లాక్కుని అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారని గుర్తుచేసుకున్నారు. దీంతో వెంటనే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నా.. అంటూ ప్రకటించిన మగాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేసుకున్నారు. దోమలపై దండయాత్ర చేసినప్పటికీ చంద్రబాబు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.