Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ వైపు ప్రియుడు, మరోవైపు 'అశ్లీల' గోల... హీరోయిన్ రియామిక ఆత్మహత్యకు కారణాలు!

  • కోలీవుడ్ లో విషాదాన్ని నింపిన ఆత్మహత్య
  • ఇటీవల అశ్లీల చిత్రంలో నటించిన రియామిక
  • ఆపై అవకాశాలు లేక ఇబ్బందులు
తమిళ హీరోయిన్ రియామిక (26) ఆత్మహత్య కోలీవుడ్ లో విషాదాన్ని నింపగా, ఆమె ఆత్మహత్య వెనుక ఉన్న పలు కోణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైలో విద్యను అభ్యసించిన రియామిక స్వస్థలం ఈరోడ్ కాగా, తన పిన్ని కొడుకు ప్రకాష్ తో కలసి వలసరవాక్కం ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఉంటోంది. గత కొంతకాలంగా రియామిక, కారంబాక్కం ప్రాంతంలో జిమ్ ట్రయినర్ గా పనిచేస్తున్న దినేష్ అనే యువకుడితో ప్రేమలో ఉందని తెలుస్తోంది.

రియామిక సంపాదనపైనే ఆమె కుటుంబం ఆధారపడివుంది. 'కుండ్రత్తిలే కుమరనుక్కు కొండాట్టం', 'ఎక్స్‌ మీడియా' చిత్రాల్లో నటించినా, సరైన గుర్తింపు, మంచి అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ఆమె డబ్బు కోసం ఓ అశ్లీల చిత్రంలో నటించింది. దీంతో ఇక మంచి చిత్రాల్లో అవకాశాలు దక్కవని, స్టార్ హీరోయిన్ గా ఎదిగే చాన్స్ లేదని స్నేహితులు హేళన చేయడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిలోకి పడిపోయింది.

మంగళవారం ఉదయం బయటకు వెళ్లిన ఆమె, బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. సోదరుడు ప్రకాష్ తో కాసేపు మాట్లాడి, ఆపై తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఆపై ఆమె ప్రియుడు దినేశ్ అక్కడికి వచ్చాడు. ఆమె గది తలుపులు ఎంత కొట్టినా తెరవకపోవడం, ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయక పోవడంతో అనుమానం వచ్చి చూడగా, ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కేసును పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
Riyamikka
Sucide
Kollywood
Lover

More Telugu News