రంగంలోకి శ్రీకాంత్ తనయుడు రోషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రంగంలోకి శ్రీకాంత్ తనయుడు రోషన్

  • 'నిర్మలా కాన్వెంట్' తో పలకరించిన రోషన్
  • ఆ తరువాత పై చదువులకి ఫారిన్ 
  • త్వరలోనే మంచి ప్రాజెక్టులో చేసే ఛాన్స్  
ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన శ్రీకాంత్, చాలా తక్కువ సమయంలోనే 100 సినిమాలను పూర్తిచేసేశాడు. ఇప్పటికీ ఒక వైపున కథానాయకుడిగా చేస్తూనే, మరో వైపున ఇతర హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు.

శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ 2016లోనే 'నిర్మలా కాన్వెంట్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. లుక్స్ పరంగా ఆకట్టుకున్న రోషన్ ఆ తరువాత పై చదువుల కోసం 'లాస్ ఏంజెల్స్' వెళ్లాడు. అక్కడి చదువు పూర్తవడంతో రోషన్ తిరిగి వచ్చేశాడు. త్వరలోనే ఒక మంచి ప్రాజెక్టులో రోషన్ చేసే ఛాన్స్ ఉందని శ్రీకాంత్ చెప్పాడు.

ఇక తన రెండవ కుమారుడు రోహన్ కూడా సినిమాల్లో చేస్తున్నాడని శ్రీకాంత్ అన్నాడు. ప్రభుదేవా కొడుకుగా ఒక సినిమాలో కనిపించనున్నాడని చెప్పాడు. మొత్తానికి శ్రీకాంత్ పెద్దబ్బాయి రోషన్ కుర్రహీరోలకి గట్టి పోటీ ఇవ్వడానికి రంగంలోకి దిగేస్తున్నాడన్న మాట.      
srikanth
roshan

More Telugu News