'చిట్టి' స్థానంలో 'కుట్టి'... '3.0' హింటిచ్చిన శంకర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'చిట్టి' స్థానంలో 'కుట్టి'... '3.0' హింటిచ్చిన శంకర్!

  • 'రోబో'కు కొనసాగింపుగా '2.ఓ'
  • దీనికి కొనసాగింపుగా '3.ఓ'
  • ఈ చిత్రం చాలాకాలం గుర్తుంటుందంటున్న ఫ్యాన్స్
'రోబో'కు కొనసాగింపుగా '2.ఓ'ను తీసుకొచ్చిన దర్శకుడు శంకర్, దీనికి కొనసాగింపుగా '3.ఓ'ను కూడా తీసుకురానున్నారా? నేడు విడుదలైన సినిమాను చూసిన అభిమానులు మాత్రం అవుననే అంటున్నారు. '3.ఓ'లో చిట్టి స్థానంలో కుట్టి అనే సూపర్ హ్యూమనాయిడ్ రోబో ఉంటుందని హింటిస్తూ సినిమాను ముగించడమే ఇందుకు కారణం. ఇక ట్రయిలర్ లో చూసింది చాలా తక్కువేనని, సినిమాలో చూడాల్సింది ఎంతో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. '2.ఓ'కు, పక్షిరాజాకు మధ్య జరిగే యుద్ధం సినీ ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండి పోతుందని అంటున్నారు.
Robo
Chitti
Kutti
2.0
3.0
Shankar

More Telugu News