ప్రేమకు నిరాకరించడమే ఆమె చేసిన నేరం.. గొంతు కోసి చంపేసిన ఉన్మాది
- తమిళనాడులోని తిరునెల్వేలిలో ఘటన
- బస్టాండులో యువతి గొంతు కోసి హత్య
- నిందితుడి కోసం పోలీసుల వేట
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని వస్తున్న మెర్సీని బస్టాండ్ వద్ద కలిసిన రవి.. తనను ప్రేమించాలని కోరాడు. అందుకామె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైన మెర్సీ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు రవి కోసం గాలిస్తున్నారు.