'రంగస్థలం' మహిమ .. 'వినయ విధేయ రామ' కేరళ హక్కుల కోసం పోటీ!
- చరణ్ హీరోగా బోయపాటి సినిమా
- కేరళలోను భారీ విడుదల
- కేరళలో పెరుగుతోన్న చరణ్ మార్కెట్
చరణ్ ఇంతకు ముందు చేసిన 'రంగస్థలం' సినిమా మలయాళంలోను విడుదలై విజయాన్ని సాధించింది. అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగానే 'వినయ విధేయ రామ' కేరళ హక్కులు భారీ రేటు పలికినట్టుగా చెబుతున్నారు. అక్కడ అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. బన్నీ మాదిరిగానే మలయాళంలో చరణ్ మార్కెట్ కూడా పెరిగిపోతుందని చెప్పుకుంటున్నారు.