విక్రమ్ కుమార్ తో నాని సినిమా ఓకే అయినట్టే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విక్రమ్ కుమార్ తో నాని సినిమా ఓకే అయినట్టే

  • నాని కోసం రంగంలోకి దిగిన విక్రమ్ కుమార్
  • మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణం 
  • త్వరలో ప్రకటనచేసే అవకాశం   
నానితో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో కొంతకాలం క్రితమే విక్రమ్ కుమార్ ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. నానికి ఆ కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే నానికి వున్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సమయంలోనే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి విక్రమ్ కుమార్ ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు బన్నీతో ప్రాజెక్టు కూడా ఆలస్యమవుతూ వచ్చింది.

తన కమిట్మెంట్స్ పూర్తికావడంతో రంగంలోకి దిగమని తాజాగా విక్రమ్ కుమార్ తో నాని చెప్పేశాడు. దాంతో విక్రమ్ కుమార్ అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు ఆ రోజునే తెలియనున్నాయి. ఈ సినిమా తరువాత బన్నీతో విక్రమ్ కుమార్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.   
vikram kumar
nani

More Telugu News