విజయ్ సినిమాలో చేయడంలేదు: రష్మిక మందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ సినిమాలో చేయడంలేదు: రష్మిక మందన

  • విజయ్ .. అట్లీ కాంబినేషన్లో సినిమా 
  • ఒక కథానాయికగా నయనతార 
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన రష్మిక  
దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్కార్' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మెర్సల్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ కాంబినేషన్ మరో మారు సెట్స్ పైకి వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారనేది కోలీవుడ్ టాక్. తాజాగా ఈ విషయంపై రష్మిక మందన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ ప్రాజెక్టు నుంచి తనని ఎవరూ సంప్రదించలేదనీ .. అందువలన తాను ఈ సినిమా చేయడంలేదని, అయితే, త్వరలోనే విజయ్ తో కలిసి మరో సినిమా చేసే అవకాశం వుందని అంది. ఇక రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన కథానాయికల జాబితాలోను రష్మిక మందన పేరు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   
rashmika

More Telugu News