గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి అదృశ్యం.. ఆందోళనలో నేతలు!

  • మంగళవారం ఉదయం అదృశ్యం
  • స్విచ్ఛాఫ్‌లో ఫోన్
  • పోలీసులకు ఫిర్యాదు
గోషామహల్ నుంచి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పోటీ పడుతున్న ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి అదృశ్యం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబరు-2లోని ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఆమె సోమవారం రాత్రి స్నేహితురాలు సోనా రాథోడ్‌తో కలిసి ఇంట్లోనే నిద్రపోయారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున బయటకు వెళ్లిన సోనారాథోడ్ తిరిగి 8 గంటలకు ఇంటికి వచ్చి చూస్తే చంద్రముఖి కనిపించలేదు. ఆమె ఫోన్‌ స్విచ్ఛాప్‌లో ఉంది. దీంతో ఆందోళన చెందిన సోనా, మరికొందరితో కలిసి అన్ని చోట్లా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంద్రముఖి అదృశ్యంపై బీఎల్ఎఫ్ నేతలు, ఆమె సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేక ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని, దీనికి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Goshamahal
Chandramukhi
BLF
Kidnap

More Telugu News