Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రయోగాత్మక పాత్రలో సమంత .. త్వరలో సెట్స్ పైకి

  • కొరియన్ మూవీగా 'మిస్ గ్రానీ'
  • సమంత ప్రధాన పాత్రగా తెలుగు రీమేక్
  • దర్శకురాలిగా నందినీ రెడ్డి        
కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన సమంత, ఈ మధ్య కాలంలో నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటూ వెళుతోంది. అలా సమంత చేసిన పాత్రలు ఆమెకి మరింత పేరును తెచ్చిపెట్టాయి. దాంతో మరో విభిన్నమైన పాత్రను చేయడానికి సమంత అంగీకరించింది. 70 ఏళ్ల వయసు కలిగిన వృద్ధురాలి పాత్రలో ఆమె కనిపించనుంది. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్.

2014లో వచ్చిన ఆ సినిమా అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దాంతో దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో ఈ వార్త వినిపిస్తూనే వుంది. నందినీ రెడ్డి .. సమంత కాంబినేషన్లోని ఈ సినిమా, అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. సమంత కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా సురేశ్ బాబు వ్యవహరించనున్నారు.        
samantha

More Telugu News