Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రమోహన్ గారు అలా పిలవొద్దంటూ కోప్పడ్డారు: సీనియర్ హీరోయిన్ సులక్షణ

  • చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాను 
  • హీరోలు .. హీరోయిన్లు నన్ను బాగా చూసుకునేవారు
  • చంద్రమోహన్ ని అంకుల్ అని పిలిచాను
తెలుగులో బేబీ డాలీ పేరుతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సులక్షణ ఎన్నో సినిమాలను చేశారు. ఆ తరువాత కథానాయికగాను చేశారు. చంద్రమోహన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సులక్షణ, ఆ తరువాత చంద్రమోహన్ సరసనే కథానాయికగా నటించారు. అప్పుడు జరిగిన ఒక విషయాన్ని గురించి ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు.

" నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం వలన అప్పటి హీరోలు .. హీరోయిన్లు నన్నెంతో బాగా చూసుకునేవారు. వాళ్లందరినీ నేను అంకుల్ .. ఆంటీ అంటూ పిలిచేదానిని. చంద్రమోహన్ గారితో హీరోయిన్ గా 'శుభోదయం' చేస్తున్నప్పుడు కూడా నేను ఆయనని 'అంకుల్' అని పిలిచాను .. అంతే ఆయనకి  కోపం వచ్చేసింది.

'చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు 'అంకుల్' అని పిలిచావు. కానీ ఇప్పుడు నన్ను అలా పిలవకూడదు' అన్నారు. 'ఎలా పిలవమంటారండీ .. బావా అని అనమంటారా?' అని అడిగాను'. 'అలా కూడా వద్దు .. మోహన్ అని పిలిస్తే చాలు' అన్నారు. 'నేను ఎవరినీ పేరు పెట్టిపిలవను .. ఏవండీ అని పిలుస్తాను' అని చెప్పాను .. అలాగే పిలిచేదానిని' అని చెప్పుకొచ్చారు.          
sulakshana
chandramohan

More Telugu News