అప్పట్లో ‘అన్నా.. నువ్వే సీఎంగా ఉండాలి’ అంటూ కేసీఆర్ మా ఇంటికి వచ్చాడు!: జైపాల్ రెడ్డి
- తెలంగాణ ఏర్పడ్డాక నన్ను కలుసుకున్నారు
- సీఎం పదవిని ఆశగా చూపించారు
- కేసీఆర్ బుద్ధి తెలుసు కాబట్టే నో చెప్పాను
ఇచ్చిన మాటపై నిలబడే అలవాటు కేసీఆర్ కు లేదని జైపాల్ రెడ్డి విమర్శించారు. ఆయన మాటల మనిషి కాదనీ, మూటల మనిషి మాత్రమేనని ఎద్దేవా చేశారు. జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.