శోభన్ బాబు చెప్పినట్టుగానే అప్పులపాలయ్యాను: మురళీమోహన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శోభన్ బాబు చెప్పినట్టుగానే అప్పులపాలయ్యాను: మురళీమోహన్

  • వ్యాపారంలో భాగస్వామిగా చేరాను 
  • ఊహించని విధంగా నష్టపోయాను 
  • శోభన్ బాబు ఆలోచన నచ్చింది  
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "హీరోగా కొంతకాలం ప్రయాణం చేశాక, ఇక కేరక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అనుకున్నంత త్వరగా అలాంటి వేషాలు రాలేదు. దాంతో వేరు వేరుగా ఇద్దరి దగ్గర సినిమా బిజినెస్ లో భాగస్వామిగా చేరాను. ఒకసారి ఈ విషయాన్ని గురించే శోభన్ బాబు దగ్గర ప్రస్తావన కొచ్చింది. 'వ్యాపారాల్లో భాగస్వామిగా ఎప్పుడూ ఉండకూడదు .. ఇబ్బందుల్లో పడతారు' అని ఆయన చెప్పారు.

ఆ తరువాత ఆయన అన్నట్టుగానే భాగస్వాముల కారణంగా పెట్టుబడిపోగా అప్పుల పాలయ్యాను. ఉన్నది కాస్తా అప్పులు తీర్చడానికే సరిపోయింది. మళ్లీ శోభన్ బాబు గారిని కలిసినప్పుడు జరిగింది చెప్పాను. 'జనాభా పెరుగుతుంది గానీ .. భూమి పెరగదు. అందువలన ల్యాండ్ పై పెట్టుబడులు పెట్టండి' అని ఆయన సలహా ఇచ్చారు. ఆయన ఆలోచన నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను అదే పనిచేస్తూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు.   
muralimohan

More Telugu News