Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను హీరోగా తీసుకున్నాక గిరిబాబును విలన్ ను చేశారు: మురళీ మోహన్

  • 'జగమే మాయ' నా ఫస్టు సినిమా 
  • ముందుగా గిరిబాబును హీరో అనుకున్నారు 
  • మేమిద్దరం మంచి స్నేహితులం      
కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి హీరోలు తమదైన స్టైల్లో దూసుకుపోతోన్న రోజుల్లో, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మురళీ మోహన్ సంపాదించుకున్నారు. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గాను కొనసాగారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నేను నాటకాలు బాగా వేసేవాడిని .. ఆ నాటకాలు చూసిన వాళ్లు సినిమాల్లో ట్రై చేయవచ్చు గదా అనేవారు. ఆ సమయంలోనే నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు 'జగమేమాయ' అనే సినిమాను కొత్తవాళ్లతో తీసే ప్రయత్నాల్లో వున్నారు. ఆ సినిమా కోసం హీరోగా గిరిబాబును తీసుకున్నారు. విలన్ పాత్ర వేసే వాళ్ల కోసం వెతుకుతుండగా పూర్ణచంద్రరావు గారు నా ఫోటోలు చూశారు. ఆ ఫోటోలు చూశాక గిరిబాబునే విలన్ గా పెట్టి .. నన్ను హీరోగా తీసుకోమని చెప్పారట. అలా నా కెరియర్ మొదలైంది. హీరో వేషం పోయినా గిరిబాబు ఏమీ ఫీల్ కాలేదు .. ఇప్పటికీ మేము మంచి స్నేహితులమే" అని చెప్పుకొచ్చారు.     
muralomohan

More Telugu News