కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు.. 20 మంది జలసమాధి!

  • కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘటన
  • కావేరీ కేసీ కాలువలో పడిపోయిన బస్సు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పడంతో ఇక్కడి కావేరీ కేసీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మంది ప్రజలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బస్సు కాలువలోకి దూసుకెళ్లడంతో అటుగా వెళుతున్న ప్రజలు నీళ్లలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశారు. మరికొందరు విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందించారు.

మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న ఈ ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామం సమీపంలో కాలువలోకి జారిపోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కాలువలో నీటి ప్రవాహం నిండుగా ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో విద్యార్థులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు.
Go Back to Shorts
karnataka
bus went canel
mandya district
20 dead
Police

More Telugu News