కేవలం 17 నిమిషాల్లోనే బాబ్రీ మసీదును కూల్చేశాం: శివసేన సంచలన వ్యాఖ్యలు
- రాముడి ఆలయాన్ని నిర్మించేందుకు ఏళ్లకు ఏళ్లు ఎందుకు పడుతోంది?
- అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాల్సిందే
- బీజేపీ అధికారంలో ఉన్నా జాప్యం ఎందుకు జరుగుతోంది?
ఆలయాన్ని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తాము హామీ ఇచ్చామని చెప్పారు. యూపీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని... అయినప్పటికీ ఆలయ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆయన మండిపడ్డారు. మసీదును కూల్చేందుకు రామభక్తులకు 17 నిమిషాలు పడితే... ఆలయాన్ని నిర్మించేందుకు ఏళ్లకు ఏళ్లు ఎందుకు పడుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి.