సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్న మరో యంగ్ హీరో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్న మరో యంగ్ హీరో

  • హిట్ కోసం సందీప్ కిషన్ వెయిటింగ్ 
  • కార్తీక్ రాజుతో ద్విభాషా చిత్రం
  • 'వేంకటాద్రి టాకీస్' పేరుతో సొంత బ్యానర్  
హీరోలు తమకంటూ ఓ సొంత బ్యానర్ ఉండాలనే నిర్ణయానికి చాలాకాలం క్రితమే వచ్చేశారు. తమ అభిరుచికి తగిన సినిమాలను తామే నిర్మించుకోవడానికి కొంతమంది హీరోలు సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ వుంటే, మరికొంతమంది ఇతర హీరోలతోనూ సినిమాలు చేసే ఆలోచనతో సొంత బ్యానర్లు స్థాపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా యువ కథానాయకుడు సందీప్ కిషన్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నాడు. తనకి తొలి హిట్ ఇచ్చిన చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' కావడంతో, ఆ సెంటిమెంట్ తో 'వెంకటాద్రి టాకీస్' పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో తెలుగు .. తమిళభాషల్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సూపర్ పవర్ వున్న హీరో చుట్టూ తిరిగే కథ ఇది. కొంతకాలంగా సందీప్ కిషన్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. సొంత బ్యానర్లో చేసే సినిమాతో సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.  
sundeepkishan

More Telugu News