సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- శుక్రవారం పార్టీ గురించి రకుల్!
- శ్రీవాస్ దర్శకత్వంలో మళ్లీ గోపీచంద్
- చైతు, సమంతల విశాఖ 'మజిలి' ముగిసింది
* గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో త్వరలో మరో చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లోనూ లౌక్యం, లక్ష్యం చిత్రాలు వచ్చాయి.
* నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న 'మజిలి' చిత్రం వైజాగ్ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలను దర్శకుడు శివ నిర్వాణ చిత్రీకరించారు. తదుపరి షెడ్యూలు ఈ నెల 26 నుంచి హైదరాబాదులో జరుగుతుంది.