అనిరుథ్ పాట పాడలేదని నిద్రమాత్రలు మింగిన తమిళ దర్శకుడు!

  • 'సోమపాన రూప సుందరన్‌' సినిమాను తెరకెక్కిస్తున్న పొన్మడి
  • బిజీ షెడ్యూల్ కారణంగా పాట పాడలేనని స్పష్టం చేసిన అనిరుథ్ 
  • వెంటనే ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణాలు
ప్రముఖ దక్షిణాది సంగీత దర్శకుడు అనిరుథ్ తన చిత్రంలో పాడేందుకు నిరాకరించాడన్న కారణంతో తమిళ దర్శకుడు పొన్ముడి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి, ఆపై దర్శకుడిగా మారి ప్రస్తుతం 'సోమపాన రూప సుందరన్‌' అనే సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన, దీనిలో అనిరుథ్ తో పాట పాడించాలని భావించారు.

విష్ణు ప్రియన్‌ హీరోగా, ఐశ్వర్యదత్తా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం తొలి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. షూటింగ్‌  ప్రారంభం కాగానే, ఐశ్వర్యదత్‌ బిగ్‌ బాస్‌ గేమ్‌ షోకి వెళ్లడంతో సినిమా ఆగిపోయింది. దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనిరుద్‌ తన బిజీ షెడ్యూల్ కారణంగా పాట పాడలేనని చెప్పాడు. దీంతో పొన్మడి ఆత్మహత్యాయత్నం చేశాడు.

దీన్ని గమనించిన సహాయ దర్శకులు వెంటనే పొన్మడిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. జరిగిన ఘటనలపై స్పందించిన పొన్మడి, అనిరుథ్ తో పాడిస్తానని సంగీత దర్శకుడు అబ్బాస్‌ రఫీ మాటిచ్చాడని, షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నామని, ఇప్పుడాయన కుదరదని చెప్పడంతో పనులు ఆగిపోయాయని అన్నారు. తన పరిస్థితి ఇంకా సీరియస్‌ గానే ఉందని, ఈ సమస్యకు పరిష్కారం ఎప్పటికి లభిస్తుందో తెలియడం లేదని వాపోయాడు.
Go Back to Shorts
Tamilnadu
Kollywood
Ponmadi
Anirudh
Song

More Telugu News