ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక అక్కడే?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక అక్కడే?

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • డిసెంబర్ 16న ఆడియో వేడుక 
  • జనవరి 9వ తేదీన సినిమా విడుదల   
ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం షెడ్యూల్స్ మొదలవుతున్నాయి. ముఖ్య పాత్రధారులు షూటింగులో జాయిన్ కావడం .. వాళ్ల పోస్టర్లు బయటికి రావడం చకచకా జరిగిపోతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగానే పనులు వేగవంతం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆడియో వేడుకను కూడా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్టుగా సమాచారం. డిసెంబర్ 16వ తేదీన తిరుపతిలో ఆడియో వేడుకను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చేశారట. పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టుగా సమాచారం. కీరవాణి స్వరపరిచిన బాణీలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో రకుల్ .. తమన్నా .. నిత్యామీనన్ భాగం కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.    
balakrishna
rakul
nithya

More Telugu News