కుర్రకారు మతులు పోగొడుతోన్న 'షకీలా' ఫస్టులుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుర్రకారు మతులు పోగొడుతోన్న 'షకీలా' ఫస్టులుక్

  • శృంగార తారగా గుర్తింపు 
  • కెరియర్ పరంగా ఎన్నోకష్టాలు 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో షకీలా నటించింది. శృంగార తారగా కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. అలాంటి షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వున్నాయి. ఎన్నో సమస్యలు .. మరెన్నో ఇబ్బందులు ఆమెను సతమతం చేశాయి. ఇక సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆమె ప్రయాణం పూలబాటలో కొనసాగలేదు. ఎదురు దెబ్బలతోనే ఆమె కెరియర్ కొనసాగింది.

ఇలా ఆమె జీవితంలోని మలుపులను కథగా చేసుకుని 'షకీలా' చిత్రం నిర్మితమవుతోంది. రిచా చద్దా టైటిల్ రోల్ ను పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఆభరణాలను మాత్రమే ధరించిన రిచా చద్దా లుక్, కుర్రకారు మతులు పోగొట్టేలా వుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ పాత్రలో ఒదిగిపోవడం కోసం, షకీలా సలహాలను .. సూచనలను రిచా చద్దా తీసుకున్న విషయం తెలిసిందే.   
richa

More Telugu News