సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!
Add ap7am to your home Screen

సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • బాలీవుడ్ అవకాశాల కోసం యత్నిస్తున్న షేర్
  • సల్మాన్ నెంబర్ కోసం ప్రయత్నాలు
  • తాను చోటా షకీల్ వద్ద పని చేస్తానంటూ బెదిరింపులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... యూపీకి చెందిన గులాబన్బీ ఉరఫ్ షేర్ అనే వ్యక్తి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. సల్మాన్ ను తన గాడ్ ఫాదర్ గా భావించాడు. ఇటీవల సల్మాన్ మేనేజర్ కు ఫోన్ చేసి... సల్లూభాయ్ నెంబర్ కావాలని అడిగాడు. దానికి మేనేజర్ తిరస్కరించాడు. దీంతో, ఆగ్రహానికి గురైన షేర్... సల్మాన్ ను చంపేస్తామంటూ బెదిరించాడు.

అంతేకాకుండా, సల్మాన్ తండ్రికి కూడా ఫోన్ చేసి, నంబరు కావాలని అడిగాడు. సల్మాన్ తండ్రి కూడా నెంబర్ ఇవ్వకపోవడంతో అతన్ని కూడా బెదిరించాడు. తాను చోటా షకీల్ వద్ద పని చేస్తుంటానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ తరపు నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. బెదిరింపులకు దిగిన వ్యక్తిని గులాబన్బీ ఉరఫ్ షేర్ గా గుర్తించిన పోలీసులు... అతన్ని అరెస్ట్ చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Salman Khan
bollywood
death threat

More Telugu News