తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాకుండా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్లయితే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై ఒక ప్రణాళికను రూపొందించుకున్నామని జనసేన అధినేత పవన్ అన్నారు. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒక్కింత కష్టతరంగా భావించామని తెలిపారు.
'తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగింది. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని తెలంగాణ ప్రజలకు వినయపూర్వకంగా తెలియచేస్తున్నా'నని పవన్ తెలిపారు.