బండ్ల గణేశ్ కు కీలక పదవి అప్పగించిన కాంగ్రెస్ పార్టీ!
- టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియామకం
- ట్విట్టర్ లో వెల్లడించిన నిర్మాత బీఏ రాజు
- రాజేంద్ర నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ గణేశ్
ఆయన్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రముఖ నిర్మాత బీఏ రాజు ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘బండ్ల గణేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గణేశ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.