సైన్స్ ఫిక్షన్ కోసం రెడీ అవుతోన్న రవితేజ
- వీఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్
- రవితేజ ద్విపాత్రాభినయం
- నాయికలుగా నాభా నటేశ్ .. పాయల్
ఇప్పుడు రవితేజ కథానాయకుడిగా ఒక సినిమాను రూపొందించడానికి వీఐ ఆనంద్ రెడీ అవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్ తో ఈ కథ కొనసాగుతుంది. రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాలో నాభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా కనిపించనున్నారు. కీలకమైన ఒక పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకోనున్నట్టుగా సమాచారం. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అదే రోజున ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.