తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైలు కెళ్లా.. ఇప్పుడు నా ప్రాణాలకు హాని ఉంది!: టీఆర్ఎస్ రెబెల్ నందికొండ శ్రీనివాసరెడ్డి

  • సుభాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి అన్యాయం చేశారు
  • ఆయన టీడీపీ కోసం పనిచేస్తున్నారు
  • విమర్శలు గుప్పించిన తిరుగుబాటు నేత
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు తాను జైలుశిక్ష అనుభవించానని టీఆర్ఎస్ తిరుగుబాటు నేత నందికొండ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేసినప్పటికీ 2014లో అధిష్ఠానం మొండిచేయి చూపిందన్నారు. ఈ సారి కూడా పార్టీ అధిష్ఠానం ఉప్పల్ టికెట్ ను ప్రజా బలం లేని సుభాష్ రెడ్డికి ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన టీడీపీ నేత దేవేందర్ గౌడ్ కు అమ్ముడుపోయాడనీ, టీఆర్ఎస్ నేతలను టీడీపీలో చేర్పిస్తున్నాడని ఆరోపించారు.

భేతి సుభాష్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా తనను రాజకీయంగా వేధిస్తున్నారని వాపోయారు. సుభాష్ రెడ్డి నేరాలు, అవినీతికి సంబంధించిన చిట్టా తనవద్ద ఉందనీ, సమయం వచ్చినప్పుడు దాన్ని బయటపెడతానని పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించాలని టీఆర్ఎస్ హైకమాండ్ ను కోరారు.
Go Back to Shorts
Telangana
uppal
subhash rteddy
jail

More Telugu News