గెలుపుగుర్రాలకే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.. 25 మందికి నేనే టికెట్లు ఇప్పించా!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- ఓ 10 స్థానాల్లో మార్పులు జరగొచ్చు
- మునుగోడులో ఘనవిజయం సాధిస్తా
- రాహుల్ తో రోడ్ షో నిర్వహిస్తాం
తెలంగాణ ఎన్నికల్లో 25 మంది అభ్యర్థులకు తాను టికెట్లు ఇప్పించానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు మునుగోడు టికెట్ ఇచ్చిందనీ, ఇక్కడ గతంలో రావి నారాయణ రెడ్డి సాధించిన భారీ మెజారిటీని అధిగమించేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం 10 స్థానాలను దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ తో కలిసి జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు.