సినీ నటుడు మోహన్ బాబుతో వైసీపీ నేత విజయసాయిరెడ్డి భేటీ!
- తిరుపతిలో కలుసుకున్న వైసీపీ ఎంపీ
- మోహన్ బాబుకు పరామర్శ
- జిల్లాలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష
అంతకుముందు తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. తిరుపతిలోని తుమ్మలగుంటలో నిర్వహించిన సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందనీ, అందుకే సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని ఆరోపించారు.