రూ. 71 లక్షల బంగారం, రూ. 31 లక్షల వెండి... నందమూరి సుహాసిని ఆస్తుల వివరాలివి!
- మహాకూటమి కూకట్ పల్లి అభ్యర్థినిగా సుహాసిని
- ఇళ్ల అద్దెలపై వస్తున్న ఆదాయం
- రూ. 1.46 కోట్ల ఆప్పులు ఉన్నాయి
- అఫిడవిట్ లో పేర్కొన్న సుహాసిని
ఇక మిక్ ఎలక్ట్రానిక్స్, శ్రీ భవానీ క్యాస్టింగ్ లిమిటెడ్ లో ప్రస్తుత విలువ ప్రకారం రూ. 5.50 లక్షల విలువైన షేర్లు ఆమెకున్నాయి. రూ. 15 లక్షల విలువైన హ్యుందాయ్ క్రెటాతో పాటు రూ. 71 లక్షల విలువైన 2.2 కిలోల బంగారం, రూ. 30 లక్షల విలువైన వజ్రాలు, రూ. 31 లక్షల విలువైన 81 కిలోల వెండి సామాన్లు ఆమె వద్ద ఉన్నాయి. సుహాసిని మొత్తం ఆస్తుల విలువ రూ. 1.52 కోట్లు కాగా, భర్త ఆస్తులు రూ. 7 లక్షలుగా, కుమారుడి ఆస్తులు రూ. 1.02 కోట్లుగా ఆమె చూపించారు.
హైదరాబాద్, ఫిల్మ్ నగర్లో రూ. 4.30 కోట్ల విలువచేసే 450 గజాల స్థలంలో ఇల్లు, తన భర్త పేరిట తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో రూ. 65 లక్షల విలువైన 3.20 ఎకరాల భూమి ఉందని, కుమారుడి పేరిట మండపేటలో రూ. 88.38 లక్షల విలువైన 2455గజాల స్థలం ఉందని చెప్పారు. తనకు రూ. 1.46 కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.