తామర జన్యుపటంతో మరిన్ని ఆవిష్కారాలు...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తామర జన్యుపటంతో మరిన్ని ఆవిష్కారాలు...!

మన దేశంలోను, చైనా దేశంలోను తామరపువ్వును ఆధ్యాత్మికతకు, పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. పరిపూర్ణ జ్ఞానానికి సంకేతంగా కూడా బౌద్ధంలో తామరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి తామర జన్యుపటాన్ని ఆవిష్కరించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వీటి జన్యురాశి ఎంతో పురాతనమైనదే కాదు, అద్భుతమైనది కూడా. తామరకు చెందిన 27 వేల జన్యువుల్లో దాదాపు 86 శాతాన్ని విజయవంతంగా పేర్చగలిగినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త జేన్‌షెన్‌ మిల్లర్‌ తెలిపారు.

తామర గింజలు కనీసం 1300 సంవత్సరాల కాలంపాటు సజీవంగా ఉంటాయి. దీర్ఘాయుష్షుకు చిహ్నంగా తామరను భావిస్తారు. ఇలాంటి అద్భుత లక్షణాలు కలిగిన ఈ మొక్కలోని జన్యువులు రకరకాల పరిస్థితులకు అనుగుణంగా మారతాయి. అయితే ఇది నిజంగా ఒక అద్భుతమని, అందుకే ఈ మొక్క విశ్వజన్యురాశిని ఒక క్రమపద్ధతిలో అమర్చడం ద్వారా మరెన్నో పరిశోధనలకు అవకాశం కలుగుతుందని మిల్లర్‌ అంటున్నారు.

More Telugu News