నిషా నెత్తికెక్కి... పోలీసులకు చిక్కిన మందు భామలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిషా నెత్తికెక్కి... పోలీసులకు చిక్కిన మందు భామలు!

  • పబ్బుల్లో పూటుగా మందుకొట్టిన అమ్మాయిలు
  • రోడ్లపైకి వచ్చి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన యువతులు
  • మొత్తం 99 వాహనాలు సీజ్
వారంతా ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న అమ్మాయిలు. వారాంతంలో పబ్బుకెళ్లి పూటుగా మందుకొట్టి ఎంజాయ్ చేశారు. మద్యం తాగిన తరువాత వాహనాలను నడపవద్దని పోలీసులు చేసే ప్రచారాన్ని విస్మరించి, రోడ్లపైకి వచ్చి అడ్డంగా దొరికిపోయారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో 5 ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుపగా, పలువురు యువతులు పట్టుబడ్డారు. వీరిలో కొందరు తనిఖీలకు సహకరించకపోవడంతో మహిళా పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది.

ఈ తనిఖీల్లో మొత్తం 99 వాహనాలు పట్టుబడ్డాయని, వీటిలో 41 కార్లు, 58 బైక్ లు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. పట్టుబడిన వారిలో 10 మంది వరకూ మహిళలు ఉండటం గమనార్హం. పట్టుబడిన వారికి సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహించి, మంగళవారం నాడు కోర్టు ముందు హాజరు పరుస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Hyderabad
Drunk Driving
Ladies
Pubs
Police
Arrest

More Telugu News