దీపికకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న అత్తవారిల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపికకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న అత్తవారిల్లు

  • కొంకణీ, సింధీ సంప్రదాయాల్లో వివాహం
  • 21, 28న బెంగుళూరు, ముంబైలో రిసెప్షన్
  • 18న ముంబైకి తిరిగి రానున్న దీప్‌వీర్
బుధవారం కొంకణీ సంప్రదాయంలో, గురువారం సింధీ సంప్రదాయ పద్ధతిలో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌ల వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ 21న బెంగళూరులో, 28న ముంబైలో రిసెప్షన్ జరగనుంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం దీప్‌వీర్‌లు డిసెంబర్ 1న గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

కొత్తజంట ఈ నెల 18న ముంబైకి తిరిగి రానున్నారని సమాచారం. దీపికకు ఘన స్వాగతం పలికేందుకు ఆమె అత్తవారిల్లు సిద్ధమవుతోంది. ఇప్పటికే విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రణ్‌వీర్ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Deepika Padukone
Ranveer singh
Etaly
Lake Komo
Mumbai

More Telugu News