Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెవి రింగుల కోసం నాలుగేళ్ల చిన్నారిపై మహిళ దాష్టీకం... వీడియో!

  • ముంబైలో ఘటన
  • అపార్టుమెంట్ లిఫ్ట్ లో పాపను హింసించిన రిజ్వానా
  • అరెస్ట్ చేసిన పోలీసులు
నాలుగేళ్ల చిన్నారి ధరించిన చెవి రింగులపై కన్నేసిన ఓ మహిళ, అత్యంత పాశవికంగా ఆ పాపను హింసించింది. ముంబైలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్ లో ఈ ఘటన జరుగగా, దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రిజ్వానా బేగం అనే మహిళ, చిన్నారిని దారుణంగా కొట్టింది. నొప్పి భరించలేని పాప ఏడుస్తుంటే, అరుపులు బయటకు వినిపించకుండా చూసేందుకు పాపపై ఎక్కి కూర్చుంది.

లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లకుండా పాపను అదిమిపట్టి, పలుమార్లు కొట్టి, దుద్దులను లాక్కుంది. ఈ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా రిజ్వానాను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఆ బాలిక చెవి రింగులను స్వాధీనం చేసుకున్నామని, నిందితురాలిని రిమాండుకు పంపామని తెలిపారు. సీసీటీవీలో రికార్డయిన వీడియో ఇదే.
Mumbai
Police
Ear rings

More Telugu News