చంద్రబాబు టీవీల్లో కనిపిస్తే తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తారు!: విజయసాయి రెడ్డి
- ఆయన్ను చూసి పిల్లలు జడుసుకున్నారు
- దేవాన్ష్ కూడా ఏడాది దాకా ఏడ్చాడు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
చంద్రబాబును చూస్తేనే పిల్లలు జడుసుకుని జ్వరాల పాలయ్యారనీ, అలాంటి వ్యక్తి గురించి అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు చెప్పాలా? అని ప్రశ్నించారు. ఏడాది వయసు వచ్చేవరకూ సొంత మనవడు దేవాన్ష్ కూడా చంద్రబాబును చూస్తే గుక్కపట్టి ఏడ్చేవాడని ఆరోపించారు. చంద్రబాబు టీవీల్లో కనిపిస్తే తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు వెంటనే ఛానల్ మారుస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.