కాకినాడ ఎస్‌ఈజెడ్‌పై చంద్రబాబు, జగన్ ఎందుకు స్పందించట్లేదు?: పవన్
- ఒక పరిశ్రమ కానీ, ఉద్యోగం కానీ రాలేదు
- భూములను అడ్డగోలుగా అమ్మారు
- అధికారులు బాధ్యత వహించాలి
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, జగన్ ఎస్‌ఈజెడ్ విషయమై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాకినాడ ఎస్ఈజెడ్‌లో ఒక పరిశ్రమగానీ.. లేదంటే ఒక ఉద్యోగం కానీ నేటి వరకూ రాలేదన్నారు. అడ్డగోలు భూ దాహానికి ఇక్కడి అధికారులు బాధ్యత వహించాలన్నారు. కాకినాడలోని భూములను అడ్డగోలుగా కేవీ రావు అనే వ్యక్తి అమ్మి.. అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుగోలు చేశారని ఆరోపించారు.